హలో పై ఫాలో అయ్యేందుకు 5 ప్రముఖ ఫిట్ నెస్ అకౌంట్స్

హలో పై ఫాలో అయ్యేందుకు 5 ప్రముఖ ఫిట్ నెస్ అకౌంట్స్

          ప్రతివ్యక్తి కి ఫిట్ నెస్ నిర్వచనం విభిన్నంగా ఉంటుంది. అది ఒకరకం జీవనశైలి. తన పట్ల తనకు గల కట్టు బాటు. నిజానికి ఫిట్ నెస్ అనేది మనస్సు, శరీరం, ఆత్మ ల మధ్య సరైన సమతుల్య సాధన. నాలాంటి కొందరికి అది ప్రతిరకంగాను జీవితంలో ఓ పెద్ద భాగం. కొంతమంది కొవ్వు కరిగించుకొని అందంగా ఉండాలి అనుకుం టారు. మరికొందరు పర్ ఫెక్ట్ జాలైన్ కావలనుకుంటారు. మరికొందరు ఫిట్ నెస్ ను ఒక మతంగా భావిస్తుంటా రు. చివరి రకానికి చెందిన వారిలో వారి జీవితం అంతా కూడా ఫిట్ నెస్¸, వ్యాయామం, డైట్ చుట్టూరా తిరుగు తుంటుంది. ప్రతీ ఒక్క అంశం పట్ల వారు ఎంతో నిర్దిష్టంగా ఉంటారు. ఫిట్ నెస్ పై వారి ఆలోచన లేదా అవ గాహనతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఫిట్ నెస్ మరియు దానికి సంబంధించిన ప్రతీ అంశం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఫిట్ నెస్ లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా అంతో ఇంతో స్ఫూర్తి అనేది అవసరమవుతుంది.

          భారతీయ వీక్షకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన  విప్లవాత్మక సోషల్ నెట్ వర్కింగ్ యాప్ అయిన హలో తమ ఫిట్ నెస్ ఆసక్తిని ప్రారంభించి, కొనసాగించాలనుకునే వారి కోసం అవసరమైన సరైన స్ఫూర్తిని ఎంతో అం దించనుంది. ప్రతీ ఒక్కరూ ఫిట్ నెస్ తో కూడిన మెరుగైన జీవితాన్ని గడిపేలా వారికి స్ఫూర్తినిచ్చేందుకు గాను హలో పై నిజంగా ఆసక్తిదాయక కంటెంట్ ను క్రియేట్ చేస్తూ, పోస్ట్ చేస్తున్న అద్భుత ఫిట్ నెస్ క్రియేటర్లు ఉ న్నారు. ఇక ముందుకు పోలేని పరిస్థితిలో ఉన్నామని మీరు భావిస్తున్నప్పుడు, జంక్ ఫుడ్, ఎక్కువ సేపు కూ ర్చొని పని చేసే జీవనశైలి, అనారోగ్యదాయక అలవాట్ల కోరల నుంచి తప్పించుకునే అవకాశం లేదనుకున్న ప్పుడు వేచిఉండొద్దు… ఈ ప్రభావశీలక ఫిట్ నెస్ క్రియేటర్ల వైపు చూడండి. వీరు మీకు స్ఫూర్తినివ్వడమే కాదు, ఆరోగ్యదాయక షెడ్యూల్ పాటించేందుకు టిప్స్, ట్రిక్స్ తో సహాయపడుతారు. వీరు ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా హలో లో లభ్యమయ్యే వివిధ ప్రాంతీయ భాషల్లో ఫిట్ నెస్ కంటెంట్ ను క్రియేట్ చేసి షేర్ చేస్తుంటారు. ఉదా హరణకు ఒక నిర్దిష్ట ఫిట్ నెస్ క్రియేటర్ పంజాబ్ నుంచి ఉన్నట్లయితే, ఆయన లేదా ఆమె  సులభంగా పంజాబీ భాషలో కంటెంట్ ను క్రియేట్ చేయవచ్చు మరియు షేర్ చేయవచ్చు. 

          హలో సోషల్ యాప్ లో ఉన్న ఈ 5 అకౌంట్లు మీకెంతో నచ్చుతాయి. ఫిట్ నెస్ ఆశయాల సాధన దిశలో వారి కట్టుబాటు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది:

          అవినాశ్ ఝా: హలో పై ప్రఖ్యాత ఫిట్ నెస్ క్రియేటర్లలో ఆయన ఒకరు. తనకు గల 84.4 వేల ఫాలోయర్లతో ఆ యన  స్త్రీ, పురుషుల వర్కవుట్ ప్లాన్స్, డైట్ టిప్స్, ఫిట్ నెస్ సవాళ్ళను పంచుకుంటారు. ఓ వ్యక్తికి అవసరమై న స్ఫూర్తిని అందిస్తారు. అది మాత్రమే కాదు, తన ఫాలోయర్స్ ను ఎంగేజ్ చేసేలా వినోదాత్మక వీడియోలను సైతం షేర్ చేసుకుంటారు. 

         ఫిట్ నెస్ గురు దినేశ్:251.4 వేల మంది ఫాలోయర్లతో దినేశ్ వివిధ కమ్యూనిటీల్లో భారీ ఫాలోయింగ్ ను కలిగిఉన్నారు. అత్యంత ప్రఖ్యాత ఫిట్ నెస్ క్రియేటర్లలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ‘ఫిట్ నెస్ లక్ష్యం’ తో ఆయన జీవిస్తుంటారు. తన యావత్ కంటెంట్ కూడా ఆ దిశగానే ఉంటుంది. రోజువారీ ప్రాతిపదికన ఆయన తన ఫిట్ నెస్ ప్రయాణ అనుభవాలను పంచుకుంటారు – బాడీ వర్కవుట్ ప్లాన్స్ నుంచి ఫిట్ నెస్ సవాళ్ల దాకా.

          కాలి బాయ్: హలో పై ప్రఖ్యాత ఫిట్ నెస్ క్రియేటర్ ఆయన. 157.5 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆయన తనను తాను కాలిస్తెనిక్స్ అథ్లెట్ ఫ్రమ్ న్యూఢిల్లీ గా చెప్పుకుంటారు. ఆయన తన పోస్ట్ లతో సరైన వర్కవుట్ ను సూచిస్తారు. అది మిమ్మల్నిఫిట్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. 

  • స్మితా యాదవ్:ఈ వేదిక పై ఉన్న అత్యంత ట్రెండింగ్ క్రియేటర్స్ లలో ఈ అద్భుత మహిళ ఒకరు. ఫిట్ నెస్ ఫ్యాషన్ లలో ఆమె పోస్టు చేస్తుంటారు. ఆమె 129.4 వేల ఫాలోయర్స్ ని కలిగి ఉన్నారు. వారితో ఆమె యోగాసనాల  టెక్నిక్స్ ను మరియు వాటి ప్రాక్టీస్ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను షేర్ చేసుకుంటారు. చిన్న చిన్న వివరాలను కూడా అందించడం ఆమె ప్రత్యేకత. వివిధ యోగాసనాలను ఆమె పిక్చర్స్ ద్వారా వివరిస్తారు.  
  • డెయిలీ ఫిట్ విత్ నిషాంత్: ఆయన ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్, కోచ్ మరియు అథ్లెట్. సుమారు 265.6 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆయన షేర్ చేసే కంటెంట్ స్ఫూర్తి దాయకంగా మరియు విద్యాత్మాకంగా ఉంటుంది.ఆయన అంకిత భావం చూసి ఫాలోయర్లు, ఆయన లా కావాలని భావిస్తూ సైక్లింగ్, ఇంటెన్స్ వర్క్ అవుట్స్ రన్నింగ్ లాంటి వాటిని చేపడుతున్నారు. 

IMG-20191226-WA0005

          ఈ ఫిట్ నెస్ క్రియేటర్లు తమ కంటెంట్ సులభంగా యాక్సెస్ చేయగలిగేలా, సెర్చ్ చేయగలిగేలా తగిన హాష్ ట్యాగ్స్ కూడా ఉపయోగిస్తుంటారు. ఈ ఫిట్ నెస్ క్రియేటర్లు ఉపయోగించే కొన్ని సాధారణ హాష్ ట్యాగ్స్ #HeloFitnessTips, #HeloFitnessChallenge, #Helo, #HeloFitness King, #HeloStar, #ShowYourFitBody మొదలైనవి.

          పైన పేర్కొన్న ఫిట్ నెస్ అకౌంట్స్ Helo social app పై ఫిట్ నెస్ కు సంబంధించిన అకౌంట్స్ మాత్రమే కాదు, ఎంతో ప్రఖ్యాతి చెందినవి కూడా. వారిని, ఈ జాబితాలో లేని వారిని కూడా  మీరు ఫాలో కావచ్చు. నిర్ధిష్ట అకౌంట్ లను ఫాలో అయ్యేందుకు గాను మీరు విశ్వసనీయత,ఆచరణాత్మకత మరియు మొత్తం మీద ఆ కంటెంట్ కనిపించే తీరు లాంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి.

గమనిక: పేర్కొన్న ఖాతాల ఫాలోయర్ల సంఖ్య 2019 నవంబర్ 19 నాటిది.

Related Stories:

స్థానిక కమ్యూనిటీలను ఏక తాటిపైకి తీసుకు వస్తున్న హెలో

హలో మిత్రులారా.. ఇవి పాటిస్తున్నారా?ఆన్ లైన్లో సురక్షితంగా ఉండటం ఎలాగో చెబుతున్న హెలో!

——————————————————————————————————————————————————————————————————————————

You can check updates on facebook, twitter and instagram & do follow me on all 3 handler.
Facebook : https://www.facebook.com/Vijvihaar
Instagram : https://www.instagram.com/vijvihaar
Twitter : https://twitter.com/VJSasi7
Youtube : https://www.youtube.com/channel/UCawQ4HqJoQrxToLGHOPmJbwSubscribe : “VIJVIHAAR” on youtube
Email : Vijiyalakshmipillai@gmail.co
Vijvihaar

 

Previous PostNextNext Post

0 Replies to “హలో పై ఫాలో అయ్యేందుకు 5 ప్రముఖ ఫిట్ నెస్ అకౌంట్స్”

Leave a Reply

Your email address will not be published.